సీఎం జగన్ తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్ తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేసుల కోసం భయపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే జగన్ పతనం ప్రారంభమైనట్టే అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా పోలవరం కోసం పారాడకపోతే ఇంకెందుకు అని ప్రశ్నించారు. రాజశేఖర్డ్డ ఐదేళ్ళ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు బాగా సంపాదించారని.. దేశంలోనే రిచెస్ట్ ఎంపీగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. పోరాడి ముఖ్యమంత్రి అయిన జగన్ ఇప్పుడు ఇలా పోలవరం విషయంలో సైలెట్ అవ్వడం సరికాదన్నారు ఉండవల్లి.
పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మాట మారుస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోరెత్తలేదేం అని నిలదీశారు. కోర్టులో కేసు వేస్తే చాలు. జగన్.. మోదీ కాలర్ పట్టుకోనక్కర్లేదు.. కనీసం కేసు కూడా ఎందుకు వేయట్లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోదీకి లొంగిపోయరనే ప్రచారం నిజమని నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com