నీటికుంటలో పడి నలుగురు మృతి!

నీటికుంటలో పడి నలుగురు మృతి!
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్లిన నలుగురు నీటికుంటలో పడి గల్లంత్తయ్యారు.

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్లిన నలుగురు నీటికుంటలో పడి గల్లంత్తయ్యారు. కృష్ణదాసన పల్లి పంచాయతీ ఒంటూరు గ్రామంలో ఇద్దరు చిన్నారులతో కలిసి ఇద్దరు మహిళలు బట్టలు ఉతకడానికి నీటికుంట వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చిన్నారులు.. ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయారు. వారిని కాపాడే క్రమంలో ఇద్దరు మహిళలు కూడా మునిగిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో ఒంటూరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పిటివరకు ముగ్గురు మృతదేహాలను వెలికితీయగా.. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు రుక్మిణి, రాజేశ్వరి తోడికోళ్లుగా గుర్తించారు.

Tags

Next Story