FREE BUS: మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ నెల 15వ తేదీ నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చెయ్యచ్చు. పల్లె వెలుగు. అల్ట్రా పల్లె వెలుగు… సిటీ ఆర్డినరీ.. మెట్రో.. ఎక్స్ ప్రెస్లో ప్రయాణం చెయ్యచ్చు. ఇప్పటికే ఏపీ కేబినెట్ సమావేశంలో మహిళల ఉచిత బస్సు పథకం ఆమోదం పొందింది.. స్త్రీ శక్తి అనే పేరు పెట్టారు. అన్ని జలాల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ సిద్ధమైందని ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుందని చెప్పారు. ఇందుకోసం అదనపు బస్సులను, సిబ్బందిని సమకూర్చుకున్నామన్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా 8,459 బస్సులను మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కోసం కేటాయించారు. ఏడాదికి ఈ పథకం అమలు వలన కోసం రూ.1,950 కోట్లు కేటాయించనుంది.
ఈ కార్డుల్లో ఏదో ఒకటి చూపాలి
రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడి కైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.. ప్రభుత్వం.. ఇక, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు చూపించి ఉచిత బస్సులో మహిళలు ప్రయాణం చేయవచ్చు.అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు మొదలు అయ్యాయి.. జీరో ఫేర్ టికెట్ మహిళలకు ఇస్తారు.. గుర్తింపు కార్డు మాత్రం ప్రయాణ సమయంలో చూపించాలి.. ఆధార్ కార్డు.. ఓటర్ ఐడీ.. రేషన్ కార్డు.. పాన్ కార్డు కొన్ని గుర్తింపు పొందిన కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఈ పథకం అమలు కోసం మొత్తం ఏపీఎస్ ఆర్టీసీకి 11,500 బస్సులు ఉండగా.. 8,459 బస్సులను మహిళల ఉచిత బస్సు పథకం కోసం కేటాయించింది.. మహిళలకు, చదువుకునే మహిళా విద్యార్ధినులకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఎంతో ప్రయోజనం పొందనున్నారు.. ఈ ఏడాదికి ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 1,950 కోట్లు నిధులు ఖర్చు చేయనుంది.. ఇప్పటికే కొత్తగా 700 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసింది.. వచ్చే రెండేళ్లలో మరో 1400 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com