Yuvagalam: ఉత్సాహంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర

Yuvagalam: ఉత్సాహంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర
Yuvagalam: నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. అడుగడుగునా లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది.

Yuvagalam: నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. అడుగడుగునా లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది. యువత, మహిళలు లోకేష్‌ను గజమాలలతో స్వాగతిస్తున్నారు. ఇరంగారిపల్లిలో యువతీ, యువకులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్‌పై లోకేష్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఒకే స్టీల్‌ ప్లాంట్‌కు మూడు సార్లు శంకుస్థాపన చేయడం జగన్ మోహన్ రెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కే లీడర్ అని విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధి లేక యువతీ, యువకులు రోడ్డున పడ్డారని లోకేష్ ఆరోపించారు. అంతకుముందు నేండ్రగుంటలో పాదయాత్ర 400 కిలో మీటర్ల పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 10 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు హామీలను నెరవేర్చుతానని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story