ముగిసిన సీఆర్‌పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ అంత్యక్రియలు

ముగిసిన సీఆర్‌పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ అంత్యక్రియలు
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మావోయిస్టుల దాడిలో అసువులు బాసిన సీఆర్‌పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ అంత్యక్రియలు ముగిసాయి.

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మావోయిస్టుల దాడిలో అసువులు బాసిన సీఆర్‌పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ అంత్యక్రియలు ముగిసాయి. మురళీకృష్ణ స్వగ్రామం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో వందలాది మంది అశ్రు నయనాల మధ్య అంతిమఘట్టం ముగిసింది. వీర జవాన్‌కు పోలీసులు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు మురళీకృష్ణ భౌతికకాయానికి పోలీసులు నివాళులర్పించారు. అనంతరం గౌరవ వందనం సమర్పించారు. జవాన్ కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు అందరినీ కలచివేసింది. వీర సైనికుడిని కడసారి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, యువకులు తరలివచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story