Ganesh Fest: గణేశ్ మండపాన్ని పెడుతున్నారా ? ఈ రూల్స్ పాటించాల్సిందే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతి తీసుకున్న వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభం కానున్న విషయం విదితమే. మరోవైపు హైదరాబాద్ నగరంలో గణేశ్ మండపాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత పొందిన ఖైరతాబాద్ గణనాథుడిని విగ్రహ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. 2025 ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6 వరకు జరగనున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా (11 రోజులు), అలాగే సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించే దుర్గామాత నవరాత్రి ఉత్సవాల (9 రోజులు) సందర్భంగా ఉచిత విద్యుత్ సదుపాయాన్ని అందించనున్నారు.ఈ మేరకు అన్ని సూపరింటెండింగ్ ఇంజినీర్లు మరియు అకౌంట్స్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.మండపాల నిర్వహకులు తమ రిజిస్ట్రేషన్ స్లిప్‌లను సంబంధిత శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.దీనికి అనుగుణంగా విద్యుత్ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
పోలీసుల సూచనలు
తెలంగాణలో వినాయక చవితి సందడి మొదలైంది. మండపాల ఏర్పాటు, బొజ్జ గణపయ్య విగ్రహాల తరలింపు ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు వినాయక మండపాల నిర్వాహకులకు పలు కీలక నిబంధనలు, హెచ్చరికలను జారీ చేశారు. విగ్రహాల తరలింపు, వినాయక మండపాల ఏర్పాటు, నవరాత్రుల నిర్వహణ, నిమజ్జనం తదితర సమయాల్లో కచ్చితంగా పాటించాల్సిన పలు జాగ్రత్తలను, నియమాలను సూచించారు. గణేశ్ మండపం ఏర్పాటు కోసం ఆన్లైన్లో పర్మిషన్ తప్పనిసరి. పర్మిషన్ కోసం
మండపాల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి. అలాగే ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించాలి. వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీకి తగ్గట్లు వినాయక మండపాలు ఏర్పాట్లు చేయాలి. వెహికిల్స్ పార్క్ చేసుకునేందుకు కూడా ప్రత్యేకంగా స్థలాలు కేటాయించాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకూడదు. ట్రాఫిక్, క్యూలైన్లను నియంత్రించేందుకు మండపాల వద్ద శుభ్రతను పాటించాల్సి ఉంటుంది. పాయింట్ బుక్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మండప నిర్వాహకుల కమిటీ సభ్యుల వివరాలు, కమిటీ ప్రెసిడెంట్/కన్వీనర్/సెక్రటరీ ఎవరో నమోదు చేయాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com