నెల్లూరు: రూప్‌కుమార్ యాదవ్‌ వర్గంపై అనిల్ గ్యాంగ్ దాడులు

నెల్లూరు: రూప్‌కుమార్ యాదవ్‌ వర్గంపై అనిల్ గ్యాంగ్ దాడులు
X
నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగుమన్నాయి. మాజీమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ వర్గం రెచ్చిపోయింది

నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగుమన్నాయి. మాజీమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ వర్గం రెచ్చిపోయింది. డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్‌ వర్గంపై అనిల్ గ్యాంగ్ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో రూప్‌కుమార్ అనుచరుడు హాజీ అబ్దుల్‌కు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌ యాదవ్ ముఖ్య అనుచరుడిగా ఉన్న హాజీ అబ్దుల్‌పై దాడి చేయడం వైసీపీలో చర్చనీయాంశమైంది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాజీ అబ్దుల్‌ను డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌ యాదవ్ పరామర్శించారు. అనంతరం మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌పై రూప్‌కుమార్ మండిపడ్డారు. తనతో కలిసి తిరుగుతున్నారనే హాజీ అబ్దుల్‌పై అనిల్ వర్గం దాడి చేసారని ఆరోపించారు. తన వర్గంపై కక్ష పెట్టుకుని కార్పొరేటర్ల ఇళ్లు, ఆఫీస్‌లపై అనిల్ అనుచరులు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమపైనే దాడులు చేపిస్తావా అనిల్? అంటూ ప్రశ్నించారు. దాడులకు తాము ప్రతిదాడులు చేస్తే నువ్వు తట్టుకోలేవు అనిల్ రూప్‌కుమార్ హెచ్చరించారు.

Tags

Next Story