బాగుందయ్యో.. ఎలికాప్టర్లో ఎగరడం..: గంగవ్వ

బాగుందయ్యో.. ఎలికాప్టర్లో ఎగరడం..: గంగవ్వ
తన యాసలో మాట్లాడుతూ అందరినీ నవ్వించింది. ఆమెని గెలిపించేందుకు సోషల్ మీడియాలో పెద్ద క్యాంపైనే జరిగింది.

ఎక్కడో పల్లెటూరులో పచ్చటి పొలాల మధ్య పెరిగిన గంగవ్వ 'మై విలేజ్' షోతో యూట్యూబ్ స్టార్‌గా ఎదిగి బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేసి మరింత మందికి చేరువయ్యింది. హౌస్‌లో యంగ్ జనరేషన్‌తో పోటీ పడి ఇంటి సభ్యుల ఆదరాభిమానాలను చూరగొంది. తన యాసలో మాట్లాడుతూ అందరినీ నవ్వించింది. ఆమెని గెలిపించేందుకు సోషల్ మీడియాలో పెద్ద క్యాంపైనే జరిగింది.

అయితే నాలుగ్గోడల మధ్య ఏసీ రూముల్లో గడపడం అవ్వకు ఏమాత్రం నచ్చలేదు.. పల్లెటూరులో వచ్చే పోయే వారిని పలకరించుకుంటూ పచ్చడి మెతుకులు తినడంలో ఉన్న ఆనందం.. ఇక్కడ పంచ భక్ష్య పరమాన్నాలు పెట్టినా రుచించలేదు. అందుకే హౌస్‌లోకి వెళ్లిన కొద్ది రోజులకే అవ్వకు ఆరోగ్యం సహకరించలేదు. హౌస్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చేసింది.

హోస్ట్ నాగార్జున ప్రామిస్ చేసినట్టుగా తన సొంత ఇంటి కలను నిజం చేసుకుంది గంగవ్వ. ఇక షో కోసమని హెలికాప్టర్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతెత్తు నుంచి తన ఊరి పొలాలను, ఇళ్లను చూసి మురిసిపోయింది.

శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలో హెలీకాప్టర్ సేవలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వేముల వాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన గంగవ్వని హెలికాప్టర్ ఎక్కించి ఆమె ముచ్చట తీర్చారు నిర్వాహకులు.

Tags

Next Story