గన్నవరం వివాహిత మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ

కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో వివాహిత మిస్సింగ్ కేసు.. మిస్టరీ వీడింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న ఆమెను.. పోలీసులు గన్నవరం తీసుకొచ్చారు. దుర్గను ఆమె భర్త సత్యనారాయణకు అప్పగించారు పోలీసులు.ఈ నెల 16న కువైట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన దుర్గ అదృశ్యమైంది. ఆమె సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుర్గ దగ్గర భారీగా డబ్బు, బంగారు ఆభరణాలు ఉన్నాయని.. కువైట్ నుంచి వచ్చిన ఆమె కడబడటంలేదని కంప్లైంట్ చేశాడు. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానం కూడా వ్యక్తమైంది. అయితే భర్తే అమెను ఎమైనా చేసుంటాడని.. దుర్గు పేరెంట్స్ కూడా ఆరోపించారు. దీంతో పోలీసుల విచారణలో ఈ మొత్తం వివాదానికి తెరపడింది.అమెకు భర్తతో ఉన్న మనస్ఫర్ధల కారణంతో కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్నేహితుల ఇంటికి దుర్గ వెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. భర్తకు భయపడే.. ప్రొద్దుటూరు వెళ్లినట్లు తెలిపింది. అక్కడి నుంచి ఆమెను గన్నవరం తీసుకొచ్చి.. భార్యాభర్తలిద్దరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com