గన్నవరం వైసీపీలో భగ్గుమన్న విబేధాలు

గన్నవరం వైసీపీలో భగ్గుమన్న విబేధాలు

గన్నవరం వైసీపీలో విబేధాలు భగ్గుమన్నాయి.ఆత్మీయ సమ్మేళనంలో ఇరు వర్గాల కార్యకర్తలు గొడవ పడ్డారు. కార్యకర్తల బాహాబాహీని పోలీసులు కూడా అదుపు చేయలేక పోయారు. ఈ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు యార్లగడ్డ వెంకట్రావు. జగన్‌ నన్ను ఎమ్మెల్యేగా పరిచయం చేయకముందు.. నాకు వంశీతో పరిచయం లేదని రిగ్గింగ్‌ చేసి గెలిచిన తర్వాత నా ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు.

2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని అన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో బీఫాంలు వంశీ ఆఫీస్‌కి వెళ్లడంతోనే తన ముఖం చూపించలేక చాలా బాధపడ్డానని అన్నారు.ఎవరికి పదవి ఇవ్వలేక.అత్యంత అవమానీయ పరిస్థితుల్లో నియోజకవర్గాన్ని వీడానని ఆవేదన వ్యక్తం చేశారు.అన్నం తినేవాడు ఎవరూ వైసీపీలో చేరడు అన్న వంశీ మాటలు ఎవరికీ గుర్తులేవా? అని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాన్ని నేను శిరసావహించా. నా వెంట ఉన్న వారిని ఎందుకు వదిలేయాలి. నా రాజకీయ భవిష్యత్తు చూసుకుంటానని జగన్‌ చెప్పారు. ఈరోజు నేను క్రాస్‌ రోడ్డులో ఉన్నా. రాజకీయాల్లో నేనెవరికీ భయపడను. ఇప్పటికీ అర్థిస్తున్నాను అన్నా గన్నవరం సీటు నాకు ఇవ్వు’ అని యార్లగడ్డ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా గన్నవరం సీటును పార్టీ అధిష్టానం తనకే ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో తన రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

Tags

Next Story