visakhapatnam steel plant : ప్రధాని మోదీ, సీఎం జగన్‌కు గంటా లేఖలు!
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు... ప్రధాని మోదీ, సీఎం జగన్‌కు లేఖలు రాశారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని మోదీకి విజప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. సింగిల్ పాయింట్ ఎజెండాతో కేంద్రం కేబినెట్ సమావేశం పెట్టాలని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేబినెట్ తీర్మానం చేయాలని కోరారు.
అటు.. స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు రాసిన లేఖలో గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు, అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యోగుల భవిష్యత్, ప్లాంట్ పరిరక్షణ, సుస్థిరతకు చర్యలు చేపట్టాలని అన్నారు. సమస్య శాశ్వత పరిష్కారానికి జగన్ దృఢమైన దృష్టితో ఉండాలని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com