Garigapati Shiva Attack: పోలీసుల హైడ్రామా

కృష్ణాజిల్లా అవనిగడ్డ పీఎస్ వద్ద ఆదివారం అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఎంపీ బాలశౌరి అనుచరుడు గరికపాటి శివపై దాడి కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీస్తుంది. బాధితుడు శివ ఫిర్యాదుతో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మేనల్లుడు రేపల్లె దామోదర్ సహా నలుగురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాసేపటికే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. ఇక మూడు రోజుల క్రితం జరిగిన దాడిపై పోలీసలు ఆలస్యంగా స్పందించారనే ఆరోపణలు వస్తున్నాయి. తన అనుచరులను స్టేషన్‌కు తీసుకెళ్లడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యే అనుచరులు హడావుడి చేశారు. ఇక ఈ కేసులో ఇవాళ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావుకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com