విశాఖ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రమాదాలు.. తాజాగా..

విశాఖ వాసుల్ని వరుస ప్రమాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా.. కోరమాండల్ ఫర్టిలైజర్స్ నుంచి విష వాయువులు వెలువడటంతో సమీప ప్రాంతాల నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో పిలకవానిపాలెం, కంచుమాంబ కాలనీలతో పాటు సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వణికిపోతున్నారు.
ఈ కంపెనీ నుంచి వెలువడిన విష వాయువులతో కళ్ల మంటలు, దగ్గు, ఊపిరి ఆడకపోవడం లాంటివి సంభవిస్తున్నాయని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాత్రిళ్లు ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని చెప్పారు. విష వాయువులు వస్తున్నాయని కంపెనీ సిబ్బందికి తెలియజేస్తే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆ కంపెనీపై కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com