కాకినాడ.. టైకి కెమికల్ ఇండస్ట్రీస్‌లో ఎయిర్ గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి

కాకినాడ.. టైకి కెమికల్ ఇండస్ట్రీస్‌లో ఎయిర్ గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి
గ్యాస్ లీక్ కావడంతో సమీపంలోని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ సర్పవరంలో ప్రమాదం చోటుచేసుకుంది. టైకి కెమికల్ ఇండస్ట్రీస్‌లో ఎయిర్ గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీకేజీతో బిల్డింగ్‌ చుట్టుపక్కన ఉన్న గోడ కూలి రోడ్డుపై చెల్లాచెదురైంది.


ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆరుగురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయినవారు సుబ్రమణ్యం, వెంకటరమణగా గుర్తించారు. గ్యాస్ లీక్ కావడంతో సమీపంలోని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story