AP: జగన్ మెడకు అదానీ లంచం ఉచ్చు

ఇప్పటికే అవినీతి కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ అధినేత జగన్.. మరో సంక్షోభంలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డంపెట్టుకుని రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడానికి అదానీ అప్పటి ఏపీ సీఎం జగన్ సహా ఐదు రాష్ట్రాల కీలక నేతలకు రూ. 2,029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికాలో కేసు నమోదైంది. ఇందులో రూ. 1750 కోట్లు అప్పటి ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని తెలిపింది. భారత సౌర విద్యత్ సంస్థ రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్‌ను అప్పట్లో అదానీ గ్రూప్ దక్కించుకుంది. దీని ప్రకారం రాష్ట్రాల డిస్కమ్‌లు సెకీతో ఒప్పందం చేసుకుంటే అదానీ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్‌ను సరఫరా చేస్తారు. అయితే అదానీ కోడ్ చేసిన ధరను చూసి డిస్కమ్‌లు బెంబేలెత్తాయి. ఒక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి రాలేదు. అవి కుదిరితే తప్ప ప్లాంట్లు ఏర్పాటు చేయలేరు... సొమ్ములు సంపాదించలేరు. ఫ్లాంట్ల ఏర్పాటుపేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి.. పెట్టుబడులు సమీకరించడంతో అదానీపై ఒత్తిడి బాగా పెరిగింది. దీంతో అదానీ గ్రూప్ లంచాల యాత్ర మొదలుపెట్టింది.
అసలేం జరిగిందంటే...
అదానీ లంచం కేసు నేపథ్యంలో నవంబర్ 21న అదానీ గ్రూప్ షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. కేసు విచారిస్తుంటే కొత్త అంశాలు బయటికొస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అదానీ గ్రూప్ చార్జ్ షీట్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y.S. జగన్ మోహన్ రెడ్డి, ఇతర అధికారులు లంచం తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) కుదుర్చుకున్న విద్యుత్ సరఫరా ఒప్పందాలు $265 మిలియన్ల లంచం కేసులో విచారణకు వచ్చాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదానీ గ్రూప్‌పై అమెరికా అభియోగాలు మోపిన రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ సీఎం లేరని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ దాని మిత్రపార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.100 కోట్ల విరాళం తీసుకున్నాడని..దీని వెనుక కూడా కుట్ర ఉందని ఆరోపణలు చేస్తున్నారు. అందంతా అలా ఉంటే మరోవైపు అమెరికాలో ఈ కేసును చాలా వేగంగా ముందుకు కదులుతుంది. ఈ కోర్టు నిర్ణయం తర్వాత ఇప్పుడు అమెరికన్ న్యాయ వ్యవస్థ ప్రకారం గౌతమ్ అదానీపై ‘ప్రాసిక్యూషన్’ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
పథకానికి సూత్రధారులు వీరే
సొమ్ము కోసం తప్పుడు సమాచారమిచ్చి అమెరికాలో నిధులు సేకరించారని.. అదానీ గ్రూప్ ఛైర్మన్ అదానీతోపాటు సాగర్ అదానీ, వినీత్ ఎస్.జైన్, అజూర్ పవర్ సీఈఓ రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని పేర్కొంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం (ఎఫ్‌సీపీఏ) కింద వీరికి సహకరించిన మరో ఐదుగురిపైనా కేసులు నమోదు చేసింది. ఈ కేసులో గౌతమ్ అదానీతోపాటు సాగర్ అదానీపైనా బుధవారం అమెరికాలో అరెస్ట్ వారంట్లు జారీ అయినట్లు కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేలా వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ‘ఉన్నతస్థాయి’ వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ఆరోపణలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com