Gautam Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్..

X
By - Prasanna |17 Feb 2022 11:51 AM IST
Gautam Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఏపీ డీజీపిగా ఉన్న ఆయనను జగన్ సర్కార్ అర్థాంతరంగా బదిలీ చేసింది.
Gautam Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఏపీ డీజీపిగా ఉన్న ఆయనను జగన్ సర్కార్ అర్థాంతరంగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. జగన్ అధికారంలోకి వచ్చాక సవాంగ్ కు ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ ఉన్నట్టుండి ఆయనను ట్రాన్స్‌ఫర్ చేయడం డిపార్ట్‌మెంట్‌లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గౌతమ్ సవాంగ్ 1986 బ్యాచ్‌కి చెందిన అధికారి. మే 30, 2019న ఏపీ డీజీపీగా బాధ్యతలను స్వీకరించారు. జూలై 31, 2023 న సర్వీసు నుండి పదవీ విరమణ చేయనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com