చిత్తూరులో బాలిక మిస్సింగ్ కేసును చేదించిన పోలీసులు

చిత్తూరులో బాలిక మిస్సింగ్ కేసును చేదించిన పోలీసులు
కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. యువకుడు బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లా చౌడెపల్లి మండలంలో కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. కిడ్నాప్‌కు గురైన బాలికను కనుగొన్న పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. రెండురోజులక్రితం చౌడేపల్లి పోలీస్టేషన్ లో బాలిక కనిపించడంలేదంటూ కేసు నమోదైంది. ఎనమసామనపల్లికి చెందిన బాలిక తల్లిదండ్రులు కేసుపెట్టారు. అయితే దర్యాప్తు ప్రారంభించిన చౌడేపల్లి పోలీసులు... బాలిక ఆచూకి కనుగొన్నారు. రవి వర్మ అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై నిర్భయ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story