Simhachalam: గిరి ప్రదక్షిణ.. 32 కి.మీలు నడుస్తూ.. సింహాద్రి అప్పన్నను స్మరిస్తూ..

Simhachalam: గిరి ప్రదక్షిణ ఆంధ్ర ప్రదేశ్‌లోని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు నిర్వహించే ముఖ్యమైన ఆచారం. దీనిని ఆషాడ పూర్ణిమ రోజున భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆచార సమయంలో భక్తులు సింహాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు.
భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి 34 కిలోమీటర్ల దూరం నడిచి ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు. ప్రయాణం చేయలేని వారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఈ విశిష్టమైన పూజలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు అప్పన్న స్వామిని తలస్తూ కాలినడకన సింహాగిరి చూట్టూ ప్రదక్షిణ చేస్తారు. మధ్యాహ్నం 2గం.లకు ప్రారంభమై మర్నాటి మధ్యాహ్నంతో ముగుస్తుంది. గిరి ప్రదక్షిణ అంటే.. సింహాచల పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహిస్తారు. దీన్నే గిరి పౌర్ణమి అని కూడా అంటారు. పౌర్ణమికి ముందు రోజు చతుర్దశి రోజు మధ్యాహ్నం భక్తులంతా సిహాచలంలోని తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు.
సుమారు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింహగిరి చుట్టూ కాలి నడకన ప్రదక్షిణ పూర్తి చేస్తారు. సింహగిరి చుట్టూ ఒక్కసారి చేసే ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానమని చెబుతారు.
విశాఖ వాసుల పెద్ద మనసు: గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని సింహగిరి చుట్టూ పండుగ వాతావరణం నెలకొంటుంది. కాలినడకన ప్రదక్షిణ చేసే భక్తులకు ప్రజలే స్వచ్ఛందంగా సేవలందిస్తారు. దారి పొడవునా నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందిస్తూ భక్తుల ఆకలి, దప్పికలు తీరుస్తుంటారు. కొండ చుట్టూ సుమారు 32 కిమీల పొడవునా ప్రజలు కులమతాలకు అతీతంగా శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందిస్తుంటారు. అప్పన్న ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన పూల రథం ఊరేగింపు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com