గీతం యూనివర్శిటీని టార్గెట్‌ చేస్తూ కూల్చివేతల పర్వం

గీతం యూనివర్శిటీని టార్గెట్‌ చేస్తూ కూల్చివేతల పర్వం

మొన్న సబ్బం హరి.. నేడు గీతం యూనివర్సిటీ. విశాఖలో కూల్చివేతల వ్యవహారం మరోసారి వివాదాస్పందంగా మారింది. ఈసారి గీతం యూనివర్శిటీని టార్గెట్‌ చేస్తూ కూల్చివేతల పర్వాన్ని మొదలుపెట్టారు జీవీఎంసీ అధికారులు. రెండు జేసీబీలతో అర్థరాత్రి నుంచి యూనివర్సిటీ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించారు. మెడికల్‌ కాలేజి ఎంట్రన్స్‌ వద్ద.. 2వందల మీటర్ల కాంపౌండ్‌ గోడను కూల్చివేశారు అధికారులు. దీంతో... గీతం యూనివర్శిటీకి వెళ్లే బీచ్‌ రోడ్డు మార్గాన్ని బ్లాక్‌ చేశారు పోలీసులు. వర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా నిర్మాణాలు కూల్చివేస్తున్నారని గీతం యూనివర్శిటీ యాజమాన్యం చెబుతోంది. అన్ని అనుమతులు ఉన్నా.. ఎందుకు యూనివర్సిటీ కట్టడాలు తోలగిస్తున్నారో అర్ధంకావడం లేదన్నారు. నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 4దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్ధులకు గీతం యూనివర్సిటీ సేవలందిస్తోందన్నారు. విశ్వవిద్యాలయానికి దేశవిదేశాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. కోవిడ్‌ సమయంలో విశేష సేవలందించామంటున్నారు కాలేజ్‌ ప్రతినిధులు.

మరోవైపు టీడీపీ నేతలు కూడా అక్కడికి చేరుకుంటుండటంతో..ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కక్షపూరితంగానే గీతం యూనివర్సిటీ నిర్మాణాలను కూల్చివస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొన్న సబ్బంహరి ఇంటి గోడను కూల్చివేశారు.. ఇప్పుడు గీతం యూనివర్సిటీని టార్గెట్‌ చేశారంటూ మండిపడుతున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా.. అన్ని అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చివేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story