AMARAVATHI: దేశానికే గేమ్ ఛేంజర్ అమరావతి క్వాంటం వ్యాలీ

AMARAVATHI: దేశానికే గేమ్ ఛేంజర్ అమరావతి క్వాంటం వ్యాలీ
X
సాంకేతిక కేంద్రంగా మారుతున్న అమరావతి... చరిత్రాత్మక అడుగు వేసిన కూటమి సర్కార్... యువతకు సరైన వేదిక క్వాంటం వ్యాలీ

ఒక­ప్పు­డు వ్య­వ­సాయ భూ­ము­ల­తో నిం­డిన తు­ళ్లూ­రు ప్రాం­తం… నేడు ప్ర­పంచ సాం­కే­తిక పటం­లో ప్ర­త్యేక స్థా­నా­న్ని దక్కిం­చు­కు­నే ది­శ­గా అడు­గు­లు వే­స్తోం­ది. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ రా­జ­ధా­ని అమ­రా­వ­తి­ని గ్లో­బ­ల్‌ టె­క్నా­ల­జీ మ్యా­ప్‌­పై ని­ల­పా­ల­న్న సం­క­ల్పం­తో రా­ష్ట్ర ప్ర­భు­త్వం మరో కీలక ముం­ద­డు­గు వే­సిం­ది. అత్యా­ధు­నిక క్వాం­టం కం­ప్యూ­టిం­గ్‌, పరి­శో­ధ­న­ల­కు కేం­ద్రం­గా ని­ల­వ­ను­న్న అమ­రా­వ­తి క్వాం­టం వ్యా­లీ భవన ని­ర్మా­ణా­ని­కి బు­ధ­వా­రం శం­కు­స్థా­పన జరి­గిం­ది. ఈ కా­ర్య­క్ర­మం రా­ష్ట్ర ఐటీ చరి­త్ర­లో­నే కా­కుం­డా, దేశ టె­క్నా­ల­జీ రం­గం­లో­నూ ఒక మై­లు­రా­యి­గా ని­ల­వ­నుం­ద­ని వి­శ్లే­ష­కు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. తు­ళ్లూ­రు మం­డ­లం ఉద్దం­డ­రా­యు­ని­పా­లెం­లో జరి­గిన ఈ శం­కు­స్థా­పన కా­ర్య­క్ర­మం­లో ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు­తో పాటు కేం­ద్ర మం­త్రి జి­తేం­ద్ర సిం­గ్ పా­ల్గొ­న్నా­రు. కేం­ద్రం–రా­ష్ట్రం కలి­సి భవి­ష్య­త్తు టె­క్నా­ల­జీ­పై పె­ట్టు­బ­డు­లు పె­ట్టేం­దు­కు ఇది ని­ద­ర్శ­న­మ­ని ఈ వే­దిక స్ప­ష్టం చే­సిం­ది.

క్వాంటం వ్యాలీ అంటే ఏమిటి?

అమ­రా­వ­తి క్వాం­టం వ్యా­లీ భా­ర­త­దే­శం­లో­నే తొలి పూ­ర్తి స్థా­యి క్వాం­టం కం­ప్యూ­టిం­గ్‌, క్వాం­టం టె­క్నా­ల­జీ హబ్‌­గా రూ­పు­ది­ద్దు­కో­నుం­ది. అమె­రి­కా­లో­ని సి­లి­కా­న్‌ వ్యా­లీ తర­హా­లో, క్వాం­టం రం­గం­లో ప్ర­పం­చం­లో­ని టా­ప్‌–5 కేం­ద్రా­ల్లో ఒక­టి­గా దీ­న్ని తీ­ర్చి­ది­ద్ద­డ­మే లక్ష్యం­గా ప్ర­భు­త్వం అడు­గు­లు వే­స్తోం­ది. ఈ ప్రా­జె­క్టు కోసం రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఇప్ప­టి­కే 50 ఎక­రాల భూ­మి­ని కే­టా­యిం­చిం­ది. ప్ర­ధాన భవనం సు­మా­రు 45 వేల చద­ర­పు అడు­గుల వి­స్తీ­ర్ణం­లో ని­ర్మిం­చ­ను­న్నా­రు. 3డీ ప్రిం­టిం­గ్‌, ప్రీ–ఇం­జి­నీ­రిం­గ్‌ వంటి అత్యా­ధు­నిక ని­ర్మాణ సాం­కే­తి­క­త­ల­తో భవ­నా­న్ని ని­ర్మిం­చ­నుం­డ­టం వి­శే­షం.

గ్లోబల్‌ దిగ్గజాల భాగస్వామ్యం

ఈ ప్ర­తి­ష్ఠా­త్మక ప్రా­జె­క్టు­లో అం­త­ర్జా­తీయ టె­క్నా­ల­జీ ది­గ్గ­జా­లు కీలక పా­త్ర పో­షిం­చ­ను­న్నా­యి. IBM, TCS, L&T వంటి సం­స్థ­లు అమ­రా­వ­తి క్వాం­టం వ్యా­లీ ఏర్పా­టు­లో భా­గ­స్వా­ము­లు­గా వ్య­వ­హ­రిం­చ­ను­న్నా­యి. IBM, TCS కలి­సి ఇక్కడ ప్ర­త్యే­కం­గా క్వాం­టం ఇన్నో­వే­ష­న్‌ సెం­ట­ర్‌­ను ఏర్పా­టు చే­య­ను­న్నా­యి. ఈ కేం­ద్రం ద్వా­రా క్వాం­టం కం­ప్యూ­టిం­గ్‌, అల్గా­రి­థ­మ్స్‌, అప్లి­కే­ష­న్ల­పై పరి­శో­ధ­న­లు, ఆవి­ష్క­ర­ణ­లు జరు­గ­ను­న్నా­యి. రా­ను­న్న కొ­ద్ది సం­వ­త్స­రా­ల్లో క్వాం­టం టె­క్నా­ల­జీ­లో కనీ­సం లక్ష మంది ని­పు­ణు­ల­ను తయా­రు చే­యా­ల­న్న­దే సీఎం చం­ద్ర­బా­బు లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు.

నోబెల్‌ సాధిస్తే రూ.100 కోట్ల బహుమతి

పరి­శో­ధ­కు­ల­ను ప్రో­త్స­హిం­చేం­దు­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వం వి­నూ­త్న ని­ర్ణ­యా­లు తీ­సు­కుం­టోం­ది. అమ­రా­వ­తి క్వాం­టం వ్యా­లీ నుం­చి ఎవ­రై­నా క్వాం­టం రం­గం­లో నో­బె­ల్‌ బహు­మ­తి సా­ధి­స్తే, వా­రి­కి ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ప్ర­భు­త్వం తర­ఫున రూ.100 కో­ట్ల నగదు బహు­మ­తి అం­ద­జే­య­ను­న్న­ట్లు ప్ర­క­టిం­చ­డం వి­శే­షం. ఇది దే­శం­లో­ని పరి­శో­ధక వర్గా­ల­కు పె­ద్ద ప్రో­త్సా­హం­గా ని­ల­వ­నుం­ది.

క్వాంటం వ్యాలీ ముఖ్యాంశాలు

అమ­రా­వ­తి క్వాం­టం వ్యా­లీ టె­క్‌ పా­ర్క్‌­లో దే­శం­లో­నే అత్యంత శక్తి­వం­త­మైన క్వాం­టం కం­ప్యూ­ట­ర్‌­ను ఏర్పా­టు చే­య­ను­న్నా­రు. 156 క్యూ­బి­ట్‌ హె­రా­న్‌ ప్రా­సె­స­ర్‌­తో పని­చే­సే ‘IBM క్వాం­టం సి­స్ట­మ్‌–2’ ఇక్కడ ఏర్పా­టు కా­నుం­ది. ఇది వా­స్తవ రూపం దా­ల్చి­తే భా­ర­త­దే­శం­లో­నే అతి­పె­ద్ద క్వాం­టం కం­ప్యూ­ట­ర్‌­గా ని­ల­వ­నుం­ది. టీ­సీ­ఎ­స్‌ సహ­కా­రం­తో లై­ఫ్‌ సై­న్సె­స్‌, క్రి­ప్టో­గ్ర­ఫీ, మె­టీ­రి­య­ల్స్‌ సై­న్స్‌, ఎన­ర్జీ ఆప్టి­మై­జే­ష­న్‌ వంటి రం­గా­ల్లో క్వాం­టం అల్గా­రి­థ­మ్స్‌, అప్లి­కే­ష­న్ల అభి­వృ­ద్ధి­పై దృ­ష్టి సా­రిం­చ­ను­న్నా­రు. వి­ద్యా సం­స్థ­లు, స్టా­ర్ట­ప్‌­లు, పరి­శ్ర­మల కోసం ప్ర­త్యేక ఎకో­సి­స్ట­మ్‌­ను కూడా అభి­వృ­ద్ధి చే­య­ను­న్నా­రు.

అమరావతిలో ఏమేమి ఏర్పాటవుతాయి?

క్వాం­టం వ్యా­లీ­లో క్వాం­టం కం­ప్యూ­టిం­గ్‌, ఆర్టి­ఫి­షి­య­ల్‌ ఇం­టె­లి­జె­న్స్‌ పరి­శో­ధన కేం­ద్రా­లు, స్టా­ర్ట­ప్‌­ల­కు ఇం­క్యు­బే­ష­న్‌ సెం­ట­ర్లు, శి­క్ష­ణా కేం­ద్రా­లు, హై­టె­క్‌ ల్యా­బ్స్‌, డేటా సెం­ట­ర్లు ఏర్పా­టు చే­య­ను­న్నా­రు. ఐటీ కం­పె­నీ­ల­కు అవ­స­ర­మైన పూ­ర్తి స్థా­యి మౌ­లిక వస­తు­లు ఇక్కడ అం­దు­బా­టు­లో ఉం­డ­ను­న్నా­యి.ఈ ప్రా­జె­క్టు ద్వా­రా క్వాం­టం పరి­శో­ధ­కు­లు, శా­స్త్ర­వే­త్త­లు, ఇం­జి­నీ­ర్లు పె­ద్ద సం­ఖ్య­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు రా­ను­న్నా­రు. దే­శీయ–అం­త­ర్జా­తీయ పె­ట్టు­బ­డు­లు ఆక­ర్షిం­చ­డ­మే కా­కుం­డా, ఏఐ, సై­బ­ర్‌ సె­క్యూ­రి­టీ, డి­ఫె­న్స్‌, ఫై­నా­న్షి­య­ల్‌ మో­డ­లిం­గ్‌, హె­ల్త్‌­కే­ర్‌, పర్యా­వ­రణ సాం­కే­తి­క­త­ల్లో అధు­నా­తన క్వాం­టం అప్లి­కే­ష­న్లు రా­ష్ట్రం­లో­నే అభి­వృ­ద్ధి కా­ను­న్నా­యి. అమ­రా­వ­తి క్వాం­టం వ్యా­లీ­ని రెం­డు దశ­ల్లో ఏర్పా­టు చే­య­ను­న్నా­రు. తొలి దశలో మౌ­లిక వస­తు­లు, వి­ద్యా రంగం, పై­ల­ట్‌ ప్రో­గ్రా­మ్‌­ల­పై దృ­ష్టి పె­ట్ట­ను­న్నా­రు. రెం­డో దశలో క్వాం­టం టె­క్నా­ల­జీ వా­ణి­జ్యీ­క­రణ, ఎగు­మ­తు­ల­పై దృ­ష్టి సా­రిం­చ­ను­న్నా­రు. ఈ టె­క్‌ పా­ర్క్‌ కోసం రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఐదే­ళ్ల­లో రూ.4,000 కో­ట్ల­ను కే­టా­యిం­చ­నుం­ది.

Tags

Next Story