బంగారం కొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్!

బంగారం కొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్!
పసిడి ప్రేమికులు శుభవార్త. బంగారం కొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గుతూనే వస్తోంది. పసిడి వెలవెలబోతూనే ఉంది. బంగారం ధర ఈరోజు కూడా తగ్గింది.

పసిడి ప్రేమికులు శుభవార్త. బంగారం కొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గుతూనే వస్తోంది. పసిడి వెలవెలబోతూనే ఉంది. బంగారం ధర ఈరోజు కూడా తగ్గింది. పసిడి రేటు దిగిరావడం ఇది వరుసగా 4వ రోజు. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి రేట్లు పడిపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని ప్రతిపాదించడంతో పసిడిపై ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 440 క్షీణించింది. దీంతో రేటు 48 వేల 380కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 పడిపోయింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 44 వేల 350కు తగ్గింది. బంగారం ధర పడిపోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు దిగొచ్చింది. దీంతో రేటు 72 వేల 200కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదలతో 17వందల 92 డాలర్లకు ఎగిసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 26.28 డాలర్లకు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story