Home
 / 
ఆంధ్రప్రదేశ్ / తూ.గో.జిల్లా...

తూ.గో.జిల్లా గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య!

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

తూ.గో.జిల్లా గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య!
X

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. సబ్బెళ్ల శ్రీనివాస్‌రెడ్డి భార్య సర్పంచ్ పదవికి పోటీ చేయకుండా విపక్షాలు ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇంతలోనే శ్రీనివాసరెడ్డిని కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. కాళ్లూ, చేతులు కట్టేసి అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇది అక్కడి గొర్రెల కాపరులు గుర్తించి వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీనిపై వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇంతలోనే.. ఆయన అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

గొల్లలగుంటలో సర్బంచ్ అభ్యర్థిగా టీడీపీ మద్దతుదారు అయిన శ్రీనివాసరెడ్డి తన భార్యతో నామినేషన్ వేయించారు. ఒత్తిళ్లను ఎదుర్కొని మరీ ఎలక్షన్‌కు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఆయన సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటో అంతు పట్టడం లేదు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఆత్మహత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Next Story