Pithapuram : మత్స్యకారులకు గుడ్ న్యూస్.. వేట నిషేధం సమయంలో రూ.10వేలు

Pithapuram : మత్స్యకారులకు గుడ్ న్యూస్.. వేట నిషేధం సమయంలో రూ.10వేలు
X

ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు సముద్రంలో వేట నిషేధం అమల్లో ఉంటుంది. మత్స్య సంపద సంతానోత్పత్తి చేస్తుంది కనుక.. ఈ విరామం అమలు చేస్తారు. ఈ రెండు నెలల కాలానికి మత్స్యకారులకు పదివేల రూపాయలు వంతున ప్రభుత్వం పరిహారం ఇస్తుంది. గత ఏడాది జూన్ లో ఎన్నికల కారణంగా ఈ పరిహారం ఇవ్వలేదు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మత్స్యకార భరోసా చెల్లించకుండా పక్కన పెట్టేసింది. దీంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు నెలలుగా వాతావరణం సహకరించక పోవడంతో వేటకు కూడా వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో తక్షణం మత్స్యకార భరోసా చెల్లించాలని.. పిఠాపురం నియోజవర్గ పరిధిలోని ఉప్పాడ కొత్తపల్లి మండల గంగపుత్రులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story