పంచాయతీ నిధులను కూడా కబ్జా చేసిన ఘనత జగన్‌దే: గోరంట్ల

పంచాయతీ నిధులను కూడా కబ్జా చేసిన ఘనత జగన్‌దే: గోరంట్ల
పోలవరాన్ని జగన్ బ్యారేజ్‌ స్థాయికి తెచ్చాడని మండిపడ్డారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి

పోలవరాన్ని జగన్ బ్యారేజ్‌ స్థాయికి తెచ్చాడని మండిపడ్డారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. చెత్త పైన కూడా పన్ను వేసిన చెత్త సీఎం జగన్‌ అని విమర్శించారు. పంచాయతీ నిధులను కూడా కబ్జా చేసిన ఘనత జగన్‌దే అన్నారు.కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్‌ ఢిల్లీ టూర్లు చేస్తున్నారని ఆరోపించారు.రాజమండ్రిలో ఎన్టీఆర్‌ యూత్‌ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన ఎన్టీఆర్‌ వ్యక్తి కాదని.. వ్యవస్థ అన్నారు. మరోవైపు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అన్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకటరాజు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేశారన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన సీనియర్‌ టీడీపీ నాయకులను సత్కరించారు. 200 మందికి వస్త్రదానం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story