GOVERNER: రుషికొండ ప్యాలెస్‌ను పిచ్చి ఆసుపత్రిగా మార్చాలి: గవర్నర్

GOVERNER: రుషికొండ ప్యాలెస్‌ను పిచ్చి ఆసుపత్రిగా మార్చాలి: గవర్నర్

ప్ర­జా­ధ­నం­తో ని­ర్మిం­చిన రు­షి­కొండ ప్యా­లె­స్‌­ను మా­న­సిక వై­ద్య­శా­ల­గా మా­ర్చా­ల­ని గోవా గవ­ర్న­ర్‌ పూ­స­పా­టి అశో­క్‌­గ­జ­ప­తి­రా­జు సలహా ఇచ్చా­రు. క్ష­త్రియ సే­వా­స­మి­తి ఆధ్వ­ర్యం­లో వి­శా­ఖ­లో సన్మాన సభ ఏర్పా­టు చే­శా­రు.‘‘అల్లూ­రి వి­గ్ర­హా­న్ని ఆవి­ష్క­రిం­చు­కు­న్నాం.. ఆయ­న్ను స్ఫూ­ర్తి­గా తీ­సు­కో­వా­లి. చాలా ఏళ్లు ప్ర­భు­త్వం­లో మం­త్రి­గా పని­చే­శా­ను. అప్పు­డు సం­క్షే­మం కోసం అప్పు­లు చే­సే­వా­రు. కానీ, గత ప్ర­భు­త్వం­లో అన్ని తా­క­ట్టు­లో పె­ట్ట­డం చూశా. వి­శా­ఖ­లో ప్ర­జా­ధ­నం­తో కట్టిన రు­షి­కొండ ప్యా­లె­స్‌ పె­చ్చు­లు ఊడి­పో­యా­య­ని తె­లి­సిం­ది. అదే రూ.600 కో­ట్లు ఉంటే ఉత్త­రాం­ధ్ర సుజల స్ర­వం­తి పూ­ర్త­య్యే­ది. ఈ ప్యా­లె­స్‌­ను ఏం చే­యా­ల­ని ప్ర­భు­త్వం ప్ర­జ­ల­ను అడు­గు­తోం­ది. దా­ని­ని పి­చ్చి ఆసు­ప­త్రి చే­స్తే మం­చి­ద­ని నా ఉచిత సలహా. కనీ­సం దా­ని­ని కట్టిన దు­ర్మా­ర్గు­ల­కి ఆ సము­ద్ర గాలి తగు­లు­తుం­ది. ఆ భవ­నాల ద్వా­రా ఎలాం­టి ఆదా­యం రాదు. ప్ర­జా­ధ­నా­న్ని ప్ర­జా హితం కోసం వా­డా­లి. మన అం­ద­రి­నీ ఇబ్బం­ది పె­ట్టా­రు. మనో ధై­ర్యం­తో ని­ల­బ­డా­లి.. లొం­గి­పో­కూ­డ­దు. మన వీర సై­ని­కు­లు ప్ర­పం­చా­ని­కి మన సత్తా చూ­పిం­చా­రు. అన్ని దే­శా­ల­కు ఒక పాఠం నే­ర్పిం­చాం’’ అని అశో­క్‌­గ­జ­ప­తి­రా­జు అన్నా­రు.

కైలాసగిరిపై సిద్ధమైన గాజు వంతెన

వి­శా­ఖ­లో మరి­కొ­ద్ది రో­జు­ల్లో గాజు వం­తెన పర్యా­ట­కు­ల­కు థ్రి­ల్ పం­చ­నుం­ది. మహా వి­శాఖ ప్రాంత నగ­రా­భి­వృ­ద్ధి సం­స్థ ఆధ్వ­ర్యం­లో కై­లా­స­గి­రి­పై 55 మీ­ట­ర్లు పొ­డ­వు కలి­గిన గాజు వం­తెన ని­ర్మా­ణం పూ­ర్త­యిం­ది. ఇది దే­శం­లో­నే అతి పొ­డ­వై­న­ది. ఒకే­సా­రి 100 మంది ని­ల­బ­డే సా­మ­ర్థ్యం­తో దీ­ని­ని ని­ర్మిం­చి­నా.. భద్రత దృ­ష్ట్యా ఒక­సా­రి­కి కే­వ­లం 40 మం­ది­కి మా­త్ర­మే అను­మ­తి­స్తా­రు. దీ­ని­పై­కి ఎక్కి­చూ­స్తే చు­ట్టూ ఎత్త­యిన కొం­డ­లు, కిం­ది భా­గం­లో లోయ, కను­చూ­పు మే­ర­లో సా­గ­రం కని­పి­స్తా­యి. గా­ల్లో తే­లి­యా­డు­తు­న్న­ట్లు, కొ­త్త లో­కం­లో వి­హ­రి­స్తు­న్న భావన పర్యా­ట­కు­ల­కు కలు­గు­తుం­ద­ని అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు.

లిక్కర్ కేసులో సిట్ దూకుడు

ఏపీ మద్యం కే­సు­లో సి­ట్‌ దర్యా­ప్తు కొ­న­సా­గు­తోం­ది. వై­సీ­పీ నేత వి­జ­యా­నం­ద­రె­డ్డి ఇళ్లు, కం­పె­నీ­ల్లో సి­ట్‌ తని­ఖీ­లు చే­సిం­ది. చి­త్తూ­రు బీ­వీ­రె­డ్డి కా­ల­నీ­లో, నలం­దా­న­గ­ర్‌­లో­ని ని­ఖి­లా­నంద అపా­ర్టు­మెం­ట్‌­లో అధి­కా­రు­లు సో­దా­లు చే­శా­రు. వి­జ­యా­నం­ద­రె­డ్డి 2024లో వై­సీ­పీ తర­ఫున పో­టీ­చే­సి ఓడి­పో­యా­రు. ఆయ­న్ను రెం­డ్రో­జుల క్రి­తం వి­జ­య­వాడ సి­ట్‌ కా­ర్యా­ల­యా­ని­కి పి­లి­చి వి­చా­రిం­చా­రు. వి­జ­యా­నం­ద­రె­డ్డి ఇంటి అడ్ర­స్సు­తో సీ­బీ­ఆ­ర్‌ ఇన్‌­ఫ్రా కం­పె­నీ ఉం­డ­టం­పై అధి­కా­రు­లు ఆరా తీ­స్తు­న్నా­రు. వై­సీ­పీ నేత చె­వి­రె­డ్డి రె­డ్డి భా­స్క­ర్ రె­డ్డి, ఆయన కు­మా­రు­డు మో­హి­త్ రె­డ్డి­కి చెం­దిన ఇన్ ఫ్రా కం­పె­నీ­ల్లో సో­దా­లు ని­ర్వ­హిం­చా­రు. అధి­కా­రు­లు చి­త్తూ­రు వె­ళ్లి ఆయా కం­పె­నీ­ల్లో తని­ఖీ­లు చే­శా­రు. ఇప్ప­టి­కే పలు రి­కా­ర్డు­ల­ను పరి­శీ­లి­స్తు­న్నా­రు. మద్యం ము­డు­పు­ల­ను కం­పె­నీ­ల్లో­కి మళ్లిం­చి­న­ట్లు­గా అధి­కా­రు­ల­కు సమా­చా­రం అం­ద­డం­తో ఈ సో­దా­లు చే­ప­ట్టా­రు. దీం­తో ఆయా కం­పె­నీ­ల్లో అధి­కా­రుల తని­ఖీ­లు ఒక్క­సా­రి­గా కల­క­లం రే­పా­యి. సమా­చా­రం తె­లు­సు­కు­న్న చి­త్తూ­రు వై­సీ­పీ శ్రే­ణు­లు ఆయా కం­పె­నీల వద్ద­కు భా­రీ­గా చే­రు­కుం­టు­న్నా­రు. సిట్ చర్య­ల­ను వ్య­తి­రే­కి­స్తు­న్నా­రు. సిట్ ను అడ్డు­పె­ట్టు­కు­ని ప్ర­భు­త్వం కక్ష సా­ధిం­పు­ల­కు పా­ల్ప­డు­తోం­ద­ని వ్యా­ఖ్యా­ని­స్తు­న్నా­రు. వి­రె­డ్డి భా­స్క­ర్‌­రె­డ్డి­కి సం­బం­ధిం­చి హై­ద­రా­బా­ద్‌­లో­నూ సి­ట్‌ తని­ఖీ­లు సా­గు­తు­న్నా­యి. తి­రు­ప­తి­లో ఆయ­న­కు చెం­దిన రి­య­ల్ ఎస్టే­ట్ కా­ర్యా­ల­యం­లో, తి­రు­ప­తి గ్రా­మీణ మం­డ­లం­లో­ని ఇం­ట్లో అధి­కా­రు­లు సో­దా­లు చే­స్తు­న్నా­రు. ఈ తనిఖీల తర్వాత సిట్ కీలక నేతలను అరెస్ట్ చేస్ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story