19 Aug 2022 4:13 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / Srikakulam : పలాసలో...

Srikakulam : పలాసలో ఉద్రిక్తత.. పేదల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు..

Srikakulam : 27వార్డు శ్రీనివాసనగర్‌ దేవబంద చెరువుగట్టు ఒడ్డున పేదల ఇళ్లను కూల్చివేసేందుకు మున్సిపల్‌, రెవెన్యూ సిబ్బంది యత్నించారు.

Srikakulam : పలాసలో ఉద్రిక్తత.. పేదల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు..
X

Srikakulam : శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 27వార్డు శ్రీనివాసనగర్‌ దేవబంద చెరువుగట్టు ఒడ్డున పేదల ఇళ్లను కూల్చివేసేందుకు మున్సిపల్‌, రెవెన్యూ సిబ్బంది యత్నించారు. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లే లక్ష్యంగా జేసీబీలతో చేరుకున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు, స్థానికుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఉద్రక్త వాతావరణంతో పోలీసులు భారీగా మోహరించారు. అధికార యంత్రాంగం కుట్రపూరితంగా చర్యలకు దిగుతోందని స్థానికులు మండిపడ్డారు.

విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు.. బాధితులకు అండగా ఉండేందుకు పలాస వెళ్లారు. అయితే అచ్చెన్నాయుడు పలాసలోకి ఎంట్రీ కాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పలాస టోల్‌ గేటు వద్దే అచ్చెన్నాయుడును ఆపేశారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రభుత్వం నడవడం లేదని ధ్వజమెత్తారు.

అటు శ్రీనివాస్‌నగర్‌ బాధితులను కలిసేందుకు వెళ్లిన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, గౌతు శిరీషను లక్ష్మీపురం టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను పరామార్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవటం ఏంటని పోలీసులను నేతలు ప్రశ్నించారు. మున్సిపాల్టీకి టాక్స్‌లు కడుతున్నా రాజకీయ కక్షతో దౌర్జన్యంగా కూల్చడానికి సిద్ధపడ్డారని రాంమోహన్‌ నాయుడు మండిపడ్డారు.

పశువుల మంత్రి ఆగడాలకు అంతులేకుండా పోతోందని, మూడేళ్లుగా పలాసలో అనేక భూకబ్జాలకు పాల్పడ్డారని గౌతు శిరీష ఆరోపించారు. పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

టీడీపీ నేతలకు మద్దతుగా పలాస వచ్చిన ఎమ్మెల్యే అశోక్‌బాబును పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అశోక్‌బాబును మందపా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అటు పలాస వెళ్లకుండా టీడీపీ నేత రవికుమార్ ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. పలాసకు టీడీపీ నేతలెవరూ వెళ్లకుండా అడ్డుకునేందుకు హైవే టోల్‌గేట్ల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Next Story