వైసీపీకి అనుకూలంగా లేకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేత..
వైసీపీకి అనుకూలంగా లేకపోతే, ఆ పార్టీలో చేరకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది విజయనగరం జిల్లాలో. అక్కడి భోగాపురం మండలం పొలిపల్లి గ్రామంలో వైసీపీకి అనుకూలంగా లేరనే కారణంగా తమకు వైఎస్సార్ చేయూత పథకం ఆపేశారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా అర్హులుగా ఉన్నా తమపై కక్షకట్టినట్టు వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కొంతమందికి పెన్షన్లు తొలగించారని, మరి కొంతమందిని వైసీపీ పార్టీలో చేరాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారంటున్నారు. పథకాల్లో అన్యాయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోతున్నారు గ్రామస్థులు. వైఎస్సార్ చేయూత పథకానికి రెండవ సారి అవకాశం వచ్చినా మళ్లీ అనర్హులుగానే గుర్తిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com