Anantapur : పారాసిటమాల్‌ సిరప్ బదులు స్కిన్‌ లోషన్‌.. ఏడేళ్ల బాలుడి ప్రాణం మీదకు

Anantapur : పారాసిటమాల్‌ సిరప్ బదులు స్కిన్‌ లోషన్‌.. ఏడేళ్ల బాలుడి ప్రాణం మీదకు
Anantapur : దగ్గు, జలుబు తగ్గడానికి మందులివ్వమంటే.. చర్మానికి రాసుకునే లోషన్‌ ఇచ్చి పిల్లాడి ప్రాణం మీదకు తెచ్చారు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది.

Anantapur : దగ్గు, జలుబు తగ్గడానికి మందులివ్వమంటే.. చర్మానికి రాసుకునే లోషన్‌ ఇచ్చి పిల్లాడి ప్రాణం మీదకు తెచ్చారు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది. అనంతపురం జిల్లా యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏడేళ్ల పిల్లాడిని తీసుకొచ్చారు తల్లిదండ్రులు. దగ్గు, జలుబు ఉండడంతో డాక్టర్‌ పారాసిటమాల్ సిరప్‌ రాసిచ్చారు.

కాని, ప్రభుత్వాసుపత్రి సిబ్బంది మాత్రం పారాసిటమాల్‌కు బదులు చర్మవ్యాధులకు వాడే లోషన్‌ ఇచ్చారు. అది ఏ ఔషధమో తెలియని తల్లిదండ్రులు ఏడేళ్ల పిల్లాడితో తాగించారు. దీంతో బాలుడి ఆరోగ్యం విషమించడంతో వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు.

విధుల్లో అశ్రద్ధ చేసిన వారిని సస్పెండ్‌ చేసి, అరెస్ట్ చేయాలని బాలుడి బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story