Anganwadis Agitation: అంగన్‌వాడీలను చర్చలకు పిలిచిన ప్రభుత్వం

అంగన్‌వాడీల సమ్మె రోజు రోజుకు ఉధృతం అవుతుండడంతో జగన్ ప్రభుత్వంలో కలవరం మొదలైంది. దీంతో అంగన్‌వాడీ సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో అంగన్‌వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది. వేతనాల పెంపుపై అంగన్‌వాడీలు పట్టుపడుతుంటే.. వేతనాలు పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని ప్రభుత్వం చెబుతోంది. ఏఐటీయూసీతోపాటు మరో రెండు సంఘాల ప్రతినిధులు చర్చలకు రావాలసిందిగా ఆహ్వానం పంపింది. దాదాపు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు.. తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
జగన్ పాదయాత్ర చేసిన సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే తెలంగాణలో కంటే రూ. వెయ్యి ఎక్కువ పెంచుతానని హామి ఇచ్చారని, ప్రస్తుతం ఆ హామీని అమలు చేయాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు. మిగతా అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి. పరిశీలిస్తామని చెప్పినప్పటికీ .. గతంలో రెండు పర్యాయాల చర్చలు జరిగినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ రోజైన తమ ఢిమాండ్లు పరిష్కరించాలని, వాటికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. వేతనం పెంపు తక్షణం అమలులోకి రావాలని అన్నారు. ఈరోజు ఆకలి కేకలు పేరుతో అన్ని శిబిరాల్లో అంగన్‌వాడీలు పల్లెలు, గరిటలు మోగించాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 14 రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఆందోళనలో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీడీపీవో ఆఫీసులు, మండల కేంద్రాల్లో సమ్మె చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కనీస వేతనం రూ.26 వేలకు పెంపు, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. అంగన్‌వాడీల సమ్మెకు విపక్ష టీడీపీ, జనసేనతోపాటు పలు పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వేతనాల పెంపు, గ్రాట్యుటీతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com