GRAHANAM: నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం

GRAHANAM: నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం
X

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆదివారం రాత్రి 8.58 గంటలకు గ్రహణం ప్రారంభం కానుంది. 11 గంటల నుంచి 12.22 వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం వీడనున్నట్టు చెబుతున్నారు. చంద్ర గ్రహణం సమయంలో మంత్రాలను జపించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని పండితులు అంటున్నారు. అలాగే ఆహార నియమాలు పాటించడం మంచిది. భారత్‌, రష్యా, సింగపూర్‌, చైనాలో కొన్ని ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం వల్ల దేశంలోని ఆలయాలన్నీ ఏడో తేదీ సాయంత్రం 5 గంటల లోపు మూసివేయాలి. తర్వాతి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు ఆచరించాలి. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు సాయంత్రం ఆరు గంటల లోపే భోజనాది నియమాలు పూర్తి చేసుకోవాలి. ఆరు గంటల తర్వాత నుంచి గ్రహణ సమయం కొనసాగేవరకూ ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిది. గ్రహణానికి ముందు పట్టు స్నానం (తల స్నానం), గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాలి. ముఖ్యంగా గర్భిణిలు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ కాల వ్యవధిలో ఇంట్లోనే ఉండేలా చూసుకోండి.

Tags

Next Story