Bobbili : బొబ్బిలి కోటలో ఘనంగా ఆయుధ పూజ..

Bobbili : విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో ఘనంగా ఆయుధ పూజ జరిగింది. బొబ్బిలి రాజ వంశీకులు, మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు, సోదరులు బేబీ నాయనలు రాచరికం ఉట్టిపడేలా వస్త్రధారణతో వేడుకల్లో పాల్గొన్నారు. చారిత్రక బొబ్బలి యుద్ధంలో అప్పటి బొబ్బిలి రాజులు వాడిన.. ఆయుధాలు, సింహాసనం, కత్తులు, తుపాకులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
బొబ్బిలి సంస్థానానికి ఆఖరి రాజు అయిన RSRK రంగారావు అధిరోహించిన బంగారు సింహాసనాన్ని.. మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి కోటలోని ప్రజాదర్బార్ మహల్ ఉంచారు. అనంతరం అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా పూజలు నిర్వహించారు. కోటలో ఆయుధ పూజను తిలకించేందుకు బొబ్బిలి ప్రజలు భారీగా తరలివచ్చారు. అటు దసరా ఉత్సవాల అలంకరణలో బొబ్బలి కోట మెరిసిపోతూ కనువిందు చేస్తోంది.
ప్రతియేటా దసరా ముందురోజు బొబ్బిలి వారసులు కోటలో ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని సుజయకృష్ణ రంగారావు అన్నారు. ఈసారి కూడా ఆయుధ పూజ, విశ్వక్షేణుని పూజలు నిర్వహించినట్టు బేబీ నాయనలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com