కాకినాడ జిల్లా వైసీపీలో భగ్గుమన్న విభేదాలు..

కాకినాడ జిల్లా వైసీపీలో భగ్గుమన్న విభేదాలు..
కాకినాడ జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నాగులాపల్లి వైసీపీలో వర్గపోరు నెలకొంది. సచివాలయంలో నిర్వహిస్తున్న వైసీపీ

కాకినాడ జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నాగులాపల్లి వైసీపీలో వర్గపోరు నెలకొంది. సచివాలయంలో నిర్వహిస్తున్న వైసీపీ గృహసారథులు, వాలంటీర్ల సమావేశాన్ని స్థానిక సర్పంచ్‌ గౌరీ రాజేశ్వరీ అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా సచివాలయంలో కన్వీనర్ల సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. వైసీపీ నేతలపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన రాజేశ్వరీ కాలర్ పట్టుకుని లాగేస్తానంటూ హెచ్చరించారు. దీంతో కంగుతున్న వైసీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక వైసీపీ పాలనలో సర్పంచ్‌లకు అడుగడుగునా అవమానం జరుగుతుందన్న రాజేశ్వరీ జగన్‌ సర్కార్‌ సర్పంచ్‌ల పాలిటశాపంగా మారిందంటూ వీడియో విడుదల చేశారు.

Tags

Read MoreRead Less
Next Story