
గుంటూరు జిల్లాల్లో పెండింగ్ బిల్లుల కోసం ఓ కాంట్రాక్టర్ కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. హర్టీ కల్చర్ కమిషనర్ శ్రీధర్ బిల్లులు మంజూరు చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని భాధితుడు హరికిషన్ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి చేతులెత్తి మొక్కాడు బాధితుడు.
హరికిషన్... వ్యవసాయశాఖకు మూడు ఎలక్ట్రిక్ ఆటోలను సప్లయ్ చేశాడు. వీటికి సంబంధించిన బిల్లులు 11లక్షల వరకు హరికిషన్‌కు రావాల్సి ఉంది. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన హరికిషన్.. కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. తనకు రావాల్సిన 11 లక్షల రూపాయల బకాయిలు ఇప్పించకుంటే.. మరణమే శరణ్యమని వాపోయారు. నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ చెప్పినా.. హార్టీకల్చర్ కమిషనర్ శ్రీధర్ బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com