గుంటూరులో కిడ్నాపైన బాలుడు క్షేమంగా ఇంటికి..

గుంటూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన బాలుడు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. బాలుడుని కిడ్నాపర్లు సత్తెనపల్లి శివారులో వదిలి వెళ్లినట్లు తెలిసింది. బాలుడు క్షేమంగా ఇంటికి చేరడంతో బాలుడి తల్లిదండ్రులు, మిత్రులు ఊపిరి పీల్చుకున్నారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నిర్మల నగర్‌లో మంగళవారం బాలుడి కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. రాత్రివేళ గుర్తుతెలియని దుండగులు బాలుడిని కిడ్నాప్ చేశారు. పోలీసులకు చెబితే చంపేస్తామని, 10లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులను డిమాండ్ చేశారు. ఎట్టకేలకు కొడుకు చెంతకు చేరడంతో బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
Next Story