గుంటూరు జిల్లాలో మరో దళిత యువకుడిపై దాడి

X
By - Nagesh Swarna |11 Sept 2020 9:31 AM IST
గుంటూరు జిల్లాలో దళిత యువకుడిపై దాడి జరిగింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన 30 మంది ఓ దళిత యువకుడిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దళిత వాడలో హల్ చల్ చేస్తూ.. భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన బాపట్ల మండలం మరుప్రోలుపాలెం ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకలో అగ్రకులానికి చెందిన కొందరు..ఓ దళిత యువతితో అసభ్యంగా ప్రవర్తించడమేకాకుండా... ఆ యువతి తమ్ముడు భాస్కర్ పై దాడికి పాల్పడ్డారు. కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో ఇందిరానగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల ఫిర్యాదుమేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com