Guntur YSRCP MLA: అధికారులు మాట వినడం లేదన్న ఎమ్మెల్యే

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సంచలన కామెంట్స్ చేశారు. కార్పొరేషన్ అధికారులపై ఆయన మండిపడ్డారు. తనకు తెలియకుండా కార్పొరేషన్ పనులు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేకే సమాచారం ఇవ్వకుండా పనులను చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు ఏం కావాలో అధికారులకంటే నాయకులకే ఎక్కువ తెలుసని అన్నారు. మానససరోవరం పార్కు బాగు చేయమని పదేపదే అడుగుతున్నా, ఇటు అధికారులు గానీ, మేయర్ గాని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ది కార్యక్రమాలను చేయకుండా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితిలేదని అన్నారు. ప్రజలు ఎదురుతిరుగుతున్నారని చెప్పారు. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నట్లు ఆవేదనతో వేడుకున్నారు. ప్రతీ సమావేశంలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులపై ముస్తఫా కామెంట్ చేయడం ఇది నాలుగోసారి. అధికారపార్టీ ఎమ్మెల్యే మాటనే గుంటూరు కార్పొరేషన్ అధికారులు పెడచెవిన పెట్టడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com