Ap Cm: చరిత్ర లిఖిస్తూన్న చంద్రబాబు తొలి సంతకాలు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ఐదు హామీలు అమలు చేయటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ స్వీట్లు పంచి పెడుతున్నారు. కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేశారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో N.T.R. విగ్రహానికి పూలమాలవేశారు. చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. పెందుర్తి తెలుగుదేశం ఇన్ ఛార్జ్ గండిబాబ్జి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఊరట కల్గించారని.. సామాజిక భద్రతా పెన్షన్లతో వృద్దులు, వికలాంగులకు ఎంతగానో మేలు జరుగుతుందన్నారు. అన్నా క్యాంటీన్ల ప్రారంభం, యువత ఉపాధి మెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యల్ని అభినందించారు.
జిల్లా నందిగామ MLA తంగిరాల సౌమ్య కార్యాలయంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి... తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. పింఛన్ల పెంపుపై... లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే. ఐదు హామీలను నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారని... సౌమ్య తెలిపారు. త్వరలోనే సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై.. కడపలో వృద్ధులు, వికలాంగులు, పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 4 వేల రూపాయల పింఛను హామీతో పాటు అన్న క్యాంటీన్లను తెరవడం శుభ పరిణామన్నారు. జగన్ అధికారంలోకి ఉన్నప్పుడు పేదలు ఆకలితో ఉండే వారని...ఇప్పుడు అన్న క్యాంటీన్లు తెరవడం వల్ల వారి బాధలు తప్పుతాయన్నారు.
రాష్ట్రంలో మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేయడంపై తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను వంచించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డీఎస్సీపై ప్రకటన చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎస్వీ వర్సిటీ పరిపాలన భవనం ఎదుట చంద్రబాబు చిత్రపటానికి నిరుద్యోగులు, విద్యార్థులు పాలాభిషేకం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com