ఎంపీ అవినాష్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

ఎంపీ అవినాష్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
జస్టిస్ జేకే.మహేశ్వరి, జస్టిస్ పీఎస్.నరసింహ ధర్మాసనం విచారణ చేపట్టనుంది

అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ జేకే.మహేశ్వరి, జస్టిస్ పీఎస్.నరసింహ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్‌ పిటిషన్‌పై.. విచారణ జరిపేలా ఆదేశించాలని పిటిషన్‌లో అవినాష్‌రెడ్డి కోరారు. తల్లి ఆరోగ్యం కారణంగా వారం పాటు సీబీఐ విచారణకు హాజరుకాలేనని, అందుకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించేంత వరకు, తనను అరెస్ట్‌ చేయకుండా సీబీఐని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు అవినాష్‌రెడ్డి.

మరోవైపు అరెస్ట్‌ను ఆపేందుకు అవినాష్‌రెడ్డి టీమ్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలోనే మకాం వేసిన కీలక వ్యక్తులు ఓవైపు కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ అరెస్ట్‌ జరగకుండా జాప్యం చేస్తూనే.. మరోవైపు అధికార వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Live Updates

  • 23 May 2023 11:40 AM GMT

    కర్నూలులో అవినాష్ రెడ్డి వర్గీయుల హంగామా

    కర్నూలులో అవినాష్ రెడ్డి వర్గీయులు హంగామా చేస్తున్నారు. రోప్ పార్టీ పోలీసులను అడ్డుకున్నారు. ఫోటోగ్రాఫర్ తీసిన పోటోల్ని డిలీట్ చేయాలంటూ వెంటాడుతున్నారు. కెమెరా జర్నలిస్టులు అవినాష్ వర్గం నుంచి తప్పించుకు వెళ్లారు.

  • 23 May 2023 8:19 AM GMT

    అవినాశ్ రెడ్డి కి సుప్రీం కోర్టులో మరో సారి ఎదురుదెబ్బ

    అవినాష్ కు సుప్రీంలో షాక్‌..  ముంద‌స్తు బెయిల్ పై జోక్యానికి సుప్రీం నిరాక‌ర‌ణ‌. హైకోర్టు వెకేష‌న్ బెంచ్ ముందు ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌న్న‌ సుప్రీంకోర్టు. 25న హైకోర్టు వెకేష‌న్ బెంచ్ అవినాష్ ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని చెప్పిన సుప్రీంకోర్టు. అంత‌వ‌ర‌కూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయ‌కుండా సిబిఐకి అదేశాలు ఇవ్వ‌డానికి నిరాక‌రించిన సుప్రీంకోర్టు.  

  • 23 May 2023 7:27 AM GMT

    సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది

    సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది. అవినాష్ విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీం కోర్టు. పిటిషన్ విచారించేలా హైకోర్టు బెంచ్ ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించాలని కోరారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం అవినాష్ విజ్ఞప్తిని తిరస్కరించింది.  25న హైకోర్టు వెకేష‌న్ బెంచ్ అవినాష్ ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని పేర్కొంది.  అంత‌వ‌ర‌కూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయ‌కుండా సిబిఐకి అదేశాలు ఇవ్వ‌డానికి సుప్రీంకోర్టు నిరాక‌రించింది.

  • గుంపులు గుంపులుగా  హాస్పిటల్ బయట అవినాష్ వర్గీయులు
    23 May 2023 7:05 AM GMT

    గుంపులు గుంపులుగా హాస్పిటల్ బయట అవినాష్ వర్గీయులు

    విశ్వభారతి హాస్పిటల్ బయట అవినాష్ రెడ్డి వర్గీయులు గుంపులు గుంపులుగా ఉన్నారు. అక్కడ కొంత మంది బైటాయించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తన వర్గీయులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  • 23 May 2023 6:14 AM GMT

    వేకువ జామునే అనుచరులతో ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్

    ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వేకువ జామున తన అనుచరులతో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మరో వైపు ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. అవినాష్ బెయిల్ పీటీషన్ పై కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం ముందుకెళ్లాలని సీబీఐ చూస్తోంది. సీబీఐ రెండు టీమ్ లలో ఒక టీమ్ హైదరాబాద్ కి వెళ్లిపోగా.. ఇంకో టీమ్ పోలీస్ గెస్ట్ లోనే ఉంది.

  • 23 May 2023 6:11 AM GMT

    తల్లితోపాటే ఐదో రోజు ఆసుపత్రిలో ఉన్న ఎంపీ అవినాష్

    ఎంపీ అవినాష్‌ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీకీ కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో ఐదో రోజు చికిత్సలు కొనసాగుతున్నాయి. అయితే తల్లితో పాటే ఎంపీ అవినాష్‌ ఆసుపత్రిలోనే ఉన్నారు. దీంతో అవినాష్‌ అనుచరులు ఆసుపత్రి వద్ద జాగారం చేశారు, వీరితో పాటు మీడియా కూడా అక్కడే ఉంది.  

Tags

Read MoreRead Less
Next Story