ఏపీలో వర్ష బీభత్సం.. ఊళ్లు ఏరులై పారుతున్నాయి..

ఏపీలో వర్ష బీభత్సం.. ఊళ్లు ఏరులై పారుతున్నాయి..
ఊళ్లు ఏరులై పారుతున్నాయి.. పొలాలను చెరువులను తలిపిస్తున్నాయి.. రోడ్లు కాలువులవై ప్రవహిస్తున్నాయి.. తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టిస్తోంది. పట్టణం...

ఊళ్లు ఏరులై పారుతున్నాయి.. పొలాలను చెరువులను తలిపిస్తున్నాయి.. రోడ్లు కాలువులవై ప్రవహిస్తున్నాయి.. తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టిస్తోంది. పట్టణం... పల్లె అని తేడా లేకుండా కుండపోత వానలకు అతలాకుతలం అవుతున్నాయి.. లోతట్టు ప్రాంతాల్ని నీట మునిగాయి.. సుమారు లక్షన్నర ఎకరాల్లో పంట పొలాలను మింగేసింది. వాగులు, వంకలను ఏకం చేసింది. భారీ వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. మరో నలుగురు గల్లంతయ్యారు.

భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు క్షణమోయుగంలా గడిపారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉభయగోదావరి జిల్లాలలో కొన్నిచోట్ల 20 సెం.మీ.కు పైగా వర్షం కురిసింది. కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోనూ 10 సెం.మీ.నుంచి 20 సెం.మీ.వరకు వానలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 146 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

వరద ముంచెత్తడంతో తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం హోప్‌ఐలాండ్‌ నుంచి 70 కుటుంబాలను, కాకినాడలోని లోతట్టు ప్రాంతం పూలే పాకల నుంచి 230 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాకినాడ సీ పోర్ట్‌లోని కంపెనీలన్నీ నీట మునిగాయి. ఉప్పాడ తీరంలో కెరటాల ఉద్ధృతికి మత్స్యకార గ్రామాల్లో పది ఇళ్లు కొట్టుకుపోయాయి. జగన్నాథపురం వంతెన వద్ద నీటిమట్టం పెరిగి చంద్రికా థియేటర్‌ ప్రాంతం, ఇంద్రపాలెం అర్జుననగర్‌ జలదిగ్బంధమయ్యాయి.

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు రైల్వేస్టేషన్‌ పట్టాలపైకి నాలుగు అడుగుల వరకు వరదనీరు చేరింది. నిడదవోలు మండలంలో 206 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో నిడదవోలు బస్టాండ్‌ పూర్తిగా జలమయమైంది. బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు అన్నీ నీటమునిగాయి. ఎర్ర కాలువ జలాశయం నిండిపోయింది. కంసాలిపాలెం, మాధవరం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి కల్వర్ట్‌ పూర్తిగా కొట్టుకుపోయింది. ముఖ్యంగా ఏలూరు నగరాన్ని తమ్మిలేరు తరుముతోంది. నగరానికి నడి మధ్యన ఉధృతంగా ప్రవహిస్తున్న తమ్మిలేరు కాల్వకు పలు చోట్ల గండిపడి వీధుల్లోకి, ఇళ్లలోకి నీరు చొచ్చుకొని వస్తోంది. వందలాది ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.. దీంతో ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు..

అనంతపురం జిల్లా వాసుల జీవన రేఖ హంద్రీనివా ప్రధాన కాలువ కోతకు గురవుతోంది. లత్తవరం గ్రామం సమీపంలోని హింద్రీనివా కాలువ భారీ కోతకు గురైంది. భారీ వర్షాలు కారణంగా ఉరవకొండ పట్టణంవైపు గట్టు సుమారు పది అడుగుల మేరకు హింద్రీనీవా ప్రధాన కాలువ గట్టు భారీగా కోతకు గురవుతోది. షెక్సుపల్లి, లత్తవరం చెరువు దిశగా వెళ్లే ఉపకాలువ నీటి కోతకు గురైంది.

Tags

Read MoreRead Less
Next Story