AP Rains: ఏపీకి కూడా వర్షాల తాకిడి.. లోతట్టు ప్రాంతాల ప్రజల ఇబ్బందులు..

AP Rains (tv5news.in)
X

AP Rains (tv5news.in)

AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి.

AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. చంద్రగిరి సమీపంలోని అమ్మ చెరువు పూర్తి స్థాయిలో నిండింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మల్లెమడుగు, చైతన్యపురం చెరువులు పూర్తి స్థాయి జలకళను సంతరించుకున్నాయి. తిరుపతి మాధవ్ నగర్ లో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. రైల్వే అండర్ బ్రిడ్జిల కింద భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం జగదీశ్ అందిస్తారు..

ఇవాళ, రేపు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. గూడూరులో ఉధృతంగా ప్రవహిస్తుంది పంబలేరు వాగు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రం ముందుకు దూసుకొస్తుండటంతో మత్స్యకార గ్రామాల్లో ఆందోళన నెలకొంది.

Tags

Next Story