RAINS: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు

తమిళనాడు, పుదుచ్చేరిలో ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలో భారీగా వానలు దంచికొడుతున్నాయి. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం కూడా కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హచ్చరించడంతో.. చిత్తూరు జిల్లా కలెక్టర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. మరోవైపు
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. పెంగల్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోనూ వర్షాలుపడుతాయని పేర్కొంది. సోమవారం నుంచి మంగళవారం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జిల్లాల్లో వానలుపడే అవకాశాలున్నాయని చెప్పింది. అలాగే ఈ నెల 4 వరకు తేలికపాటి జల్లులు పడే సూచనలున్నాయని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com