RAINS: భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం

ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా బాపట్ల జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ అతలాకుతలం
భారీ వర్షం కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. మొఘల్‌రాజపురం, పటమట వంటి అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్‌లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విజయవాడలోని మొగల్రాజపురం, పటమట ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోకి వర్షపు నీరు చేరింది. భారీవర్షాల వల్ల ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును మూసివేశారు. శ్రీకనకదుర్గానగర్ గుండా భక్తులు రాకపోకలు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు రోడ్లపై పడ్డాయి. ఉయ్యూరు-కాటూరు రోడ్డుపై చెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, అరటి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పంట నష్టంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతిలోనూ భారీ వర్షాలు
తిరుపతిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తిరుపతి నగరంలో హఠాత్తుగా కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా సాయినగర్‌లో ఓ భారీ చెట్టు కూలి ఆటోపై పడింది. తిరుపతి ప్రజలు అకాల వర్షాలతో ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పంటలకు తీవ్ర నష్టం
అకాల వర్షాల కారణంగా కృష్ణా జిల్లాలో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంట నీటిపాలవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఏలూరు, కోనసీమ జిల్లాల్లోనూ వర్షాలు, గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ టవర్లు దెబ్బతిన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com