కుప్పం పొలాల్లో హెలీకాప్టర్ ల్యాండింగ్.. తృటిలో తప్పిన ప్రమాదం

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని నంగిలి వద్ద తృటిలో హెలీకాప్టర్ ప్రమాదం తప్పింది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఎన్‌వీఎన్ జ్యువెలరీ షాపు యజమాని శ్రీనివాసన్ కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుండగా వాతావరణం అనుకూలించలేదు. హెలీకాప్టర్‌లో ఇద్దరు పైలెట్లతో పాటు ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. తిరుపత్తూరు జిల్లా నంగిలివద్ద పంట పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న తిరుపత్తూరు పోలీసులు.... పరిస్థితిని పర్యవేక్షించారు. వాతావరణం అనుకూలించడంతో హెలీకాప్టర్ తిరుపతికి బయల్దేరింది.
Next Story