ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయి: రేణు దేశాయ్

అమ్మా నాన్న విడిపోయినా తండ్రి ప్రేమను, ఆప్యాయతను పొందుతున్నారు. బయటకు వచ్చినప్పుడు ఎంతో డీసెంట్ గా బిహేవ్ చేస్తుంటారు. అందులో మంచిని వెతకాలి కానీ, ఒక పర్సన్ ని జడ్జ్ చేయడానికి మనం ఎవరం. ఎవరి పరిస్థితులు వారివి.. ఎంత సెలబ్రిటీస్ అయినా వారికి మనస్సు ఉంటుంది. బాధ ఉంటుంది. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే పెద్దవాళ్లు పట్టించుకోకపోయినా చిన్నారుల మనసు క్షోభిస్తుంది. అనే ముందు అలాచించాలన్న ఇంగితం కొంచెమైనా ఉండాలి. ఇప్పటికే రేణూ దేశాయ్ ఎంతో హూందాగా దయచేసి నా పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగవద్దు అని రిక్వెస్ట్ చేసింది. అయినా మీమ్స్ రాయుళ్లు మారలేదు.. మళ్లీ ఆమెను బాధ పెట్టే మీమ్స్ తయారు చేశారు. తన కూతురు ఆద్య కన్నీళ్లకు కారణమయ్యారు.
ఇటీవల, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నెవా, పిల్లలు అకీరా నందన్, ఆధ్యలతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ని ప్రశంసించారు. అయితే, పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్‌ను అవమానించేలా కొందరు వ్యక్తులు ఫోటోను ఉపయోగించి మీమ్స్ సృష్టించారు. అభ్యంతరకరమైన మీమ్‌లను ఖండిస్తూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
“కొంతమంది ఎలా ప్రవర్తిస్తారో చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. మీరు ఆ ఫోటోను కత్తిరించడం, మీమ్‌లను పోస్ట్ చేయడం మరియు భయంకరమైన జోకులు వేయడం, మీరు ఎంత సంస్కారవంతులో తెలియజేస్తుంది. మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. తన తల్లిని ఎగతాళి చేస్తూ వచ్చిన పోస్ట్ చూసి నా కూతురు విపరీతంగా ఏడ్చింది. మీరు సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేస్తున్నప్పుడు, మీకు తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు కూడా ఉన్నారని గుర్తుంచుకోండి. సోషల్ మీడియాలో విచక్షణ కొరవడడం బాధాకరం. నా కూతురు కన్నీళ్లు మిమ్మల్ని కర్మ రూపంలో వెంటాడుతాయి. విచక్షణారహిత వ్యాఖ్యలు, చేసిన మీమ్స్ మీ ఆలోచనలు ఎంత చెత్తగా ఉన్నాయో తెలియజేస్తున్నాయి అని ”రేణూ దేశాయ్ పేర్కొన్నారు.
జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ కళ్యాణ్ తన కుటుంబ సమేతంగా మంగళగిరి నివాసానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వారు రోడ్డు పక్కన ఆగి ఫోటో దిగారు, దానిని జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది వైరల్ అయ్యింది, వార్త కూడా అయ్యింది. ఇప్పుడు రేణూ దేశాయ్ దేశాయ్ బాధకు కోపానికి కారణం అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com