Venkaiah Naidu: వెంకయ్యనాయుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?

Venkaiah Naidu: వెంకయ్యనాయుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?
Venkaiah Naidu: వెంకయ్యనాయుడు.. తెలుగు వారి వెలుగు సంతకం. తేనెలొలుకు తెలుగు అక్షరానికి నిండుదనం.

Venkaiah Naidu: వెంకయ్యనాయుడు.. తెలుగు వారి వెలుగు సంతకం. తేనెలొలుకు తెలుగు అక్షరానికి నిండుదనం. తెలుగు సాంప్రదాయినికి నిలువెత్తు రూపం.. వెంకయ్యనాయుడు. అలుపెరుగని గళం.. విరామమెరుగని నాయకుడు.. వెంకయ్యనాయుడు. వెంకయ్యనాయుడు పూర్తి పేరు ముప్పవరపు వెంకయ్యనాయుడు. 1949 జులై 1న నెల్లూరులోని చవటపాలెం గ్రామంలో ఆయన జన్మించారు. నెల్లూరులోని వి.ఆర్ హైస్కూల్‌లో ఆయన చదువుకున్నారు. ఆయన తల్లిదండ్రులు రంగయ్య, రమణమ్మ.

నెల్లూరులోని వి.ఆర్ కళశాలలో డిగ్రీ పూర్తి చేసిన వెంకయ్యనాయుడు.. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971లో వివాహం చేసుకున్న ఆయనకు ఒక కుమారుడు హర్షవర్థన్, కుమార్తె దీపా వెంకట్ ఉన్నారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వెంకయ్యనాయుడు.. 1973-74లో ఆంధ్ర విశ్వవిద్యాలయపు విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో అనేక మాసాలు జైలు జీవితం గడిపారు.

1977 నుంచి 1980 వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షునిగా వ్యవహరించారు. అదే సమయంలో తొలిసారి 1978లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980 నుంచి బీజేపీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1983లో రెండోసారి ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో ఉమ్మడి ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో వెంకయ్యనాయుడు తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

2000లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కేబినెట్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు వెంకయ్యనాయుడు. ఇక.. 2002లో జానా కృష్ణామూర్తి అనంతరం వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2004, అక్టోబర్ 18 వరకు బీజేపీ అధ్యక్ష పదవిలో ఉన్నారు. అయితే మహారాష్ట్రలో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన జాతీయాధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత 2004 నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు వెంకయ్యనాయుడు. ఆ తర్వాత 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగా.. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్యనాయుడు.. ప్రధాని మోదీ మంత్రివర్గంలో కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరికం నిర్మూలన శాఖల మంత్రిగా పని చేశారు. 2017లో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story