అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
పోలీసుల తీరుపై దివాకర్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమరణ దీక్షకు బయలుదేరిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇంటి వద్దే ఆయన ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అటు జేసీ దివకర్‌ రెడ్డిని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో పోలీసుల తీరుపై దివాకర్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు వ్యతిరేకంగా తాహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహర దీక్ష చేసి తీరుతామన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్‌ అయ్యారు. ఓవైపు జేసీ బ్రదర్స్‌ ను ఇంటి దగ్గరే కట్టడి చేశారు. వారి ఇంటివైపు ఎవరు రాకుండా ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. షాపులను సైతం మూసివేయించారు. అటు తాడిపత్రి తహశీల్దారు కార్యాలయం దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు.

జేసీ సోదరులను అరెస్ట్‌ చేయడంతో వారి తరుపున దీక్ష చేయడానికి ఎమ్మోర్వో ఆఫీసుకు చేరుకున్నారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి సతీమణి ఉమా రెడ్డి.. ఆమెను కూడా అడ్డుకున్న పోలీసులు తిరిగి వెనక్కు పంపించేశారు.

మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డికి crpc 159 ప్రకారం నోటీసులు జారీ చేశారు పోలీసులు. తాడిపత్రిలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున దీక్ష చేయడానికి అనుమతి లేదంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. భారీగా అనుచరులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీక్షకు అనుమతి నిరాకరించమాన్నరు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం తలెత్తే అవకాశం ఉందని.. అందుకే ఇంటి దగ్గర దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి 149 నోటీసులు ఇచ్చామన్నారు తాడిపత్రి డీఎస్పీ.

Tags

Read MoreRead Less
Next Story