స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వం వెనకడుగు..

X
By - kasi |9 Oct 2020 12:48 PM IST
ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో కీలక విచారణ జరిగింది. కరోనా నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం కష్టమని ప్రభుత్వం తెలపగా.. ఈ అంశంపై ఎలక్షన్ కమీషన్ ను వివరణ ఇవ్వనియ్యండని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలే జరుగుతుండగా పంచాయతీ ఎలక్షన్ నిర్వహించడానికి ఇబ్బంది ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ కమీషన్ కు నోటీసులు హైకోర్టు జారీ చేసి.. తదుపరి విచారణ నవంబర్ 2 కు వాయిదా వేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com