అడిషనల్‌ అడ్వకేట్ జనరల్ వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు సీరియస్‌

అడిషనల్‌ అడ్వకేట్ జనరల్ వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు సీరియస్‌
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానాల ముందు నిలబడలేకపోతున్నాయి.. కోర్టు సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయాల్లో మార్పులు చేసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు కోర్టు తీర్పులపై బహిరంగంగా..

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానాల ముందు నిలబడలేకపోతున్నాయి.. కోర్టు సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయాల్లో మార్పులు చేసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు కోర్టు తీర్పులపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.. అయితే, ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసి అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ న్యాయమూర్తి ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్మే ప్రక్రియను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి.. తన వానలు వినిపించే క్రమంలో అదనపు అడ్వకేట్‌ జనరల్‌ ధర్మాసనాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.. ధర్మాసనంలో కొందరు ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమానికి అడ్డుపడుతున్నారని, వారిని పరిపాలన చేసుకోమనండి అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్‌ అయింది.. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారంటూ సూటిగానే ప్రశ్నించింది.

హైకోర్టునా, పిటిషనర్స్ నా.. అంటూ ద్విసభ్య ధర్మాసనం ఏఏజీని కొశ్చన్‌ చేసింది. రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి హైకోర్టు వేదిక కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఏఏజీకి సూచించింది. ఇక ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పూర్తి స్తాయి విచారణ చేస్తామని చెప్తూ కేసుని అక్టోబర్ 16కి వాయిదా వేసింది. ప్రతివాదులుగా వున్న ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.. కౌంటర్‌ దాఖలుకు అక్టోబరు ఆరు వరకు గడువిచ్చింది. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మి, నిధులు సమకూర్చుకోవాలని బిల్డ్ ఏపీ అనే కార్యక్రమం మొదలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, వైజాగ్, గుంటూరులో ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుంటూరుకు చెందిన తోట సురేశ్ బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది.. విచారణ పూర్తయ్యాకే తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story