మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు

మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు
గవర్నర్‌తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్‌ వేశారు.

మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గవర్నర్‌తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్‌ వేశారు. నిమ్మగడ్డ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

మరోవైపు గవర్నర్‌ కార్యాలయం నుంచి ప్రివిలేజ్ లెటర్స్‌ లీక్‌ అవలేదంటూ గవర్నర్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ క్లారిటీ ఇచ్చారు. లెటర్స్‌ లీక్‌ అవడంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఈనెల 20వ తేదీన హైకోర్టుకెళ్లారు. అయితే కేసును విచారించేందుకు విముఖత చూపిన న్యాయమూర్తి.. నాట్‌ బిఫోర్‌ మీ అంటూ పిటిషన్‌ను తిప్పి పంపారు. న్యాయమూర్తి విజ్ఞప్తిని పరిశీలించిన చీఫ్‌ జస్టిస్‌.. పిటిషన్‌ను వేరే బెంచ్‌కు మార్చారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story