పేకాట, మట్కా ఆడేందుకు వైసీపీ నాయకులే ఆర్థికసాయం చేస్తున్నారు : బాలకృష్ణ

MLA Balakrishna Fire on YCP Government : వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ(Hindupur MLA Balakrishna). వైసీపీ(YSRCP) పరాకాష్టకు తాడిపత్రి ఘటనే నిదర్శనమని చెప్పుకొచ్చారు. హిందూపురం(Hindupur)లో ఐదు నెలల్లో 5 మంది మున్సిపల్ కమిషనర్లను మార్చారని, మాట వినకపోతే అధికారులను మార్చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూపురంలో పేకాట, మట్కాకు వైసీపీ(YCP) నాయకులే ఆర్థికసాయం చేస్తూ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. శాంతికి మారుపేరైన హిందుపురాన్ని అరాచకంగా తయారుచేస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం మోసం చేస్తోందని, పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఉద్యమించకపోతే.. ఇంకో 20 ఏళ్లు ఈ రాష్ట్రం వెనక్కు వెళ్తుందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com